»The Sensational Hero Who Had An Accident Two Legs
Tovino Thomas : ప్రమాదానికి గురైన సెన్సేషన్ హీరో.. రెండు కాళ్లు!
అప్పుడప్పుడు షూటింగ్ సమయంలో గాయాల పాలవుతుంటారు హీరోలు. ఈ మధ్య కాలంలో విశాల్ చాలా ప్రమాదాలకు గురయ్యాడు. తాజాగా ఓ మళయాళ స్టార్ హీరో కూడా షూటింగ్ స్పాట్లో ప్రమాదానికి గురయ్యాడు.
తెలుగు జనాలు టొవినో థామస్ (Tovino Thomas) అంటే గుర్తు పట్టడం కాస్త కష్టం కానీ.. 2018 హీరో అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అలాగే రెండేళ్ల కిందట వచ్చిన ‘మిన్నల్ మురళీ’ సినిమా(Minnal Murali’ movie)తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టోవినో థామస్. కానీ 2018 ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద సంచలనంగా నిలిచింది. కేరళ వరదల (Kerala floods) నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దీంతో టొవినో థామస్‌కు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది.
అతని నెక్స్ట్ సినిమాల కోసం మళయాళంతో పాటు తెలుగు (Telugu) లోను ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆడియెన్స్. అయితే తాజాగా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు ఈ స్టార్ హీరో. ‘డ్రైవింగ్ లైసెన్స్ (Driving license)’ డైరెక్టర్ లాల్ జూనియర్ తెరకెక్కిస్తున్న ‘నడిగర్ తిలకం’ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ సినిమా పెరంబవూరు సమీపంలోని మారంపల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్(Shooting)లోనే ప్రమాదవశాత్తు టోవినో థామస్‌కు గాయాలయ్యాయి. అది ఎలా జరిగిందనే విషయం తెలియకపోయినా.. ఆయన రెండు కాళ్లకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆస్పత్రిలో చేర్పించగా.. పెద్దగా గాయాలు కాలేదని చెప్పారట వైద్యుల. కాకపోతే ఓ వారం రోజులు రెస్ట్ (Rest) తీసుకోవాల్సి ఉందని అన్నారట. దీంతో మరో వారం రోజుల్లో ‘నడిగర్ తిలకం’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.