హైదరాబాద్లోని ప్రగతినగర్ ఎన్ఆర్ఐ కాలనీ(NRI Colony)లో విషాదం జరిగింది.నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ నాలాలో పడి కొట్టుకుపోయాడు.2గంటలపాటు గాలించగా రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి డెడ్ బాడీని రెస్క్యూ సిబ్బంది (Rescue personnel) బయటకు తీస్తుండగా మళ్లీ కొట్టుకుపోయింది. గత రెండు రోజులుగా హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం ధాటికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా, నాలాలు పొంగి పొర్లుతున్నాయి.ఇటీవల ముషీరాబాద్ పరిధిలోని గాంధీనగర్(Gandhinagar)కు చెందిన ఓ మహిళ నాలాలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
బాలుడు నాలాలో పడిపోయిన విజువల్స్ అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరా(CC camera)లో రికార్డ్ అయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు అధికారులు బాలుడి కోసం ముమ్మురంగా గాలించగా.. చివరకు రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహాం (dead body) లభ్యం అయ్యింది. నాలాలో పడి మృతి చెందిన బాలుడు మితున్ రెడ్డి (Mithun Reddy) (4)గా గుర్తించారు. ఇంటికి ముందు ఆడుకుంటున్న బాలుడు గంటల్లో మృతదేహాంగా కనిపిండచంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.