మేడ్చల్ జిల్లా(Medchal District)లో భారీ వర్షాలకు మైసమ్మగూడ అపార్ట్మెంట్లలోని మొదటి అంతస్తు వరుకు వరద నీరు చేరింది. ఆ భవంతుల్లో ఉన్న దాదాపు 15 హాస్టల్స్ నీట మునిగియి. బయటకు వచ్చే వీలు లేకపోవడంతో విద్యార్థులు అందరు చెందారు.తమకు కాపాడలంటు ఆర్తనాదాలు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు(Rains)నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల కాలనీల్లో ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడిన ప్రతిసారి తమకు ఈ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు.
క్రితం నెల ఏకధాటి వర్షాలకు వచ్చిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే..మళ్లీ ఈ వరదలు (Floods) తమను నష్టాల్లోకి నెట్టేశాయని వాపోతున్నారు.గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడ(Maisammaguda)లో భారీ వర్షం కురుస్తోంది. అక్కడి చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా మైసమ్మగూడ ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్న ప్రైవేటు హాస్టల్స్ (Hostels) మొదటి అంతస్తులోకి వరద నీరు చేరింది. సుమారు 15 అపార్ట్మెంట్ల(apartments)లోకి వరదనీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువును తరలిపిస్తోంది. ఆందోళన చెందుతున్న విద్యార్థులను పొక్లెయిన్ల సాయంతో బయటకు తరలించారు. నీటి కాలువలు, కుంటలు కబ్జా చేసి భవనాలు నిర్మించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు విమర్శిస్తున్నారు. నీటి కాలువలు, కుంటలు కబ్జా చేసి భవనాలు (Buildings) నిర్మించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని స్థానికులు విమర్శిస్తున్నారు.