బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) అందానికి ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఆమె నటనకు కూడా ఎవరూ వంక పెట్టాల్సిన అవసరం లేదు. రీసెంట్ గానే ఆమెకు జాతీయ అవార్డు (National Award) వచ్చింది. మిమీ చిత్రంలో కృతి సనన్ తన నటనకు జాతీయ అవార్డును అందుకుంది. అయితే కృతి సనన్ తన ప్రయాణం పూల బాటలాగా సాగలేదని ఆమె చెప్పారు. 50 మందికి పైగా మోడల్స్ ముందు కొరియోగ్రాఫర్ (Choreographer) తనను ఎలా తిట్టారని, దీంతో తాను ఏడ్చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ, కృతి సనన్ ఇలా పంచుకున్నారు, “నా మొదటి ర్యాంప్ షో(Ramp show) అక్కడ ఓ కొరియోగ్రాఫర్ ఉన్నారు. నేను ఆమెతో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదు. ర్యాంప్ షో సరిగా చేయలేదని, కొరియోగ్రాఫర్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించింది. మొదటిసారి కావడంతో తాను సరిగా చేయలేకపోయాను. 50 మంది మోడల్స్ (Models) ముందు ఆమె నన్ను చాలా అసభ్యంగా తిట్టడం వల్ల నేను ఏడవడం మొదలుపెట్టాను.’’ అని కృతి గుర్తు చేసుకున్నారు.
నేను ముంబైకి వచ్చిన కొత్తలో ఇది జరిగింది. అప్పట్లో మోడలింగ్ (Modeling) చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని. నా అదృష్టం కొద్దీ ఒకేసారి ‘వన్ నేనొక్కడినే’, ‘హీరోపంతీ (Heropanti)’ అనే రెండు సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. మరికొన్ని రోజుల్లో మూవీ చిత్రీకరణ మొదలవుతుందనగా ఓ ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వెళ్లా. పచ్చికలా ఉన్న లాన్లో క్యాట్ వాక్ చేస్తున్నా.
ఉన్నట్టుండి నేను వేసుకున్న హీల్స్ మడమలు నేలలోకి దిగబడిపోయాయి. దీంతో, గందరగోళానికి లోనైన నేను మధ్యలోనే ఆగిపోవడంతో.. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ..దాదాపు యాభై మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ పక్కకి వెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఆ తరువాత మళ్లీ ఆమెతో కలిసి పనిచేయలేదు అంటూ ఆనాటి చేదు అనుభవం గుర్తు చేసుకుంది.