‘ఏ మాయ చేశావే’ సినిమా సమయంలో ప్రేమలో పడి.. కొన్నాళ్లు చట్టాపట్టాలేసుకొని తిరిగిన నాగ చైతన్య(Naga Chaitanya), సమంత.. పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరు విడిపోతున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత(Samantha).. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిందని తెలిసిన సమయంలో.. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుశాంత్ (Sushant), అఖిల్ సమంతలో ధైర్యాన్ని నింపేలా ట్వీట్ చేశారు. దాంతో సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య కూడా దీనిపై స్పందిస్తాడని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు చైతూ మాత్రం కలవలేదు కదా.. స్పందించలేదు లేదు కూడా. కానీ నాగార్జున (Nagarjuna) మాత్రం సమంతను వ్యక్తిగతంగా కలవబోతున్నాడని ప్రచారం జరిగింది.
ఇదంతా కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఈసారి మాత్రం చై, సామ్ కలవడం పక్కా అని అంటున్నారు. అయితే అసలు మ్యాటర్ వేరే ఉంది. చైతూతో విడిపోయాక సమంత నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ‘యశోద’ ఓకె అనిపించినా ‘శాకుంతలం(Sakunthalam)’ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ రీసెంట్గా వచ్చిన ‘ఖుషి’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 7 సందర్భంగా విజయ్ దేవరకొండ దగ్గర సమంత పేరును ప్రస్తావించాడు నాగార్జున. ఆమెను కలుస్తామని కూడా అన్నాడు. అయితే కలవడం అంటే డైరెక్ట్‌గా కలవడం కాదు.. థియేటర్లో కలవడం లేండీ. సమంత నటించిన ‘ఖుషి’ సినిమా(Khushi’ movie) చూడడానికి ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు నాగ్. అందులో చైతన్య కూడా ఉంటాడని అంటున్నారు. నాగచైతన్యకు ఇష్టం లేకపోయినా.. తండ్రి మాటను కాదనలేక వెళ్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సామ్, చైతన్య ఎప్పుడు హాట్ టాపికే.