»Bihar Newly Married Woman Leaves Husband After Objection To Usage Of Fb Instagram
Insta, Facebook స్మార్ట్ ఫోన్ తెచ్చిన తంటా.. 15 రోజులకే పెళ్లి పెటాకులు
కుటుంబంలో తీవ్ర గొడవ జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా అసలు విషయం తెలిసింది. పెళ్లయినప్పటి నుంచి ఫోన్ పట్టుకునే కాలక్షేపం చేస్తోంది. రోజంతా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతోందని భర్త, అతడి కుటుంబసభ్యులు చెప్పారు. భర్త, అత్త, ఇతర కుటుంబీకులు తనను ఫోన్ వాడకుండా చేస్తున్నారని భార్య తెలిపింది.
సామాజిక మాధ్యమాలు (Social Media) పచ్చటి కాపురంలో నిప్పులు పోస్తున్నాయి. సామాజిక ఖాతాలు భార్యాభర్తల (Wife and Husband) మధ్య విబేధాలు సృష్టిస్తున్నాయి. తరచూ ఫోన్ (Smart Phone)లలో మునిగి తేలడంతో అనుమానాలు మొదలవుతున్నాయి. అవి కాస్తా పెళ్లి పెటాకులయ్యే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే బిహార్ (Bihar)లో చోటుచేసుకుంది. పెళ్లయి 15 రోజులు కాకముందే నవ వధూవరుల (Newly Married Couple) మధ్య సోషల్ మీడియా చిచ్చు రేపింది. ఇన్ స్టాగ్రామ్ (Instagram), ఫేస్ బుక్ (Facebook) వాడొద్దన్నందుకు భర్తను భార్య వదిలేసి పుట్టింటికి చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.
వైశాలి జిల్లా (Vaishali District) హాజీపూర్ (Hajipur)కు చెందిన ఇలియాస్ తో సబా ఖాతూన్ కు 15 రోజుల కిందట వివాహం జరిగింది. ఇంకా పెళ్లి పనులు కూడా పూర్తి కాలేదు. కానీ కుటుంబంలో గొడవ (Scuffle) మొదలైంది. ఎందుకంటే సబా అస్తమానం ఫోన్ (Mobile Phone) పట్టుకుని కూర్చుని ఉంటోందని ఇలియాస్ కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఇలియాస్ భార్య సబాను ఫోన్ వాడకుండా చేశాడు. దీంతో వెంటనే సబా తన సోదరుడికి విషయం తెలిపింది. వెంటనే సబా సోదరుడు వచ్చి బావపైకి తుపాకీ (Gun) ఎక్కి పెట్టాడు.
దీంతో ఆ కుటుంబంలో తీవ్ర గొడవ (Quarrel) జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయగా అసలు విషయం తెలిసింది. పెళ్లయినప్పటి నుంచి సబా ఫోన్ పట్టుకునే కాలక్షేపం చేస్తోంది. రోజంతా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వాడుతోందని భర్త ఇలియాస్ తోపాటు అతడి కుటుంబసభ్యులు చెప్పారు. భర్త, అత్త, ఇతర కుటుంబీకులు (Parents) తనను ఫోన్ వాడకుండా చేస్తున్నారని భార్య సబా తెలిపింది. ఆమె ఫోన్ ను ఇలియాస్ సోదరులు దొంగిలించారని సబా తల్లి రజియా ఖాన్ చెప్పింది. కనీసం తన బిడ్డతో ఫోన్ లో కూడా మాట్లాడనివ్వడం లేదని వాపోయింది.
ఇలాంటి ఇంట్లో నా కూతురు ఉండదని ఆమె తేల్చి చెప్పింది. ఇక సబా కూడా భర్తను (Husband) వదిలేస్తానని తేల్చి చెప్పింది. ఇకపై ఒక్క క్షణం కూడా అక్కడ ఉండేది లేదని చెప్పేసి.. వెంటనే బ్యాగ్ సర్దేసుకుని పుట్టింటికి (Home) వెళ్లిపోయింది. పెళ్లయిన 15 రోజులకే ఇలా జరగడంతో ఇరు పక్షాల బంధువులు ముక్కున వేలేసుకున్నారు. స్మార్ట్ ఫోన్ ఎంత పని చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఫోన్ కు దూరంగా ఉండడం మంచిదేనని హితవు పలికారు. అస్తమానం ఫోన్ లో ఉంటే ఎవరికైనా ఇబ్బందేనని గుర్తు చేశారు.