ధూమపాన ప్రియులకు (Smokers) మరో చేదు వార్త. ఇకపై సిగరెట్ (Cigarettes) పట్టుకోవాలంటే భయపడాల్సిందే. ఎందుకంటే ఇన్నాళ్లు సిగరెట్ పెట్టెపై భయంకరమైన ఫొటోలతో కనిపిస్తున్న హెచ్చరికలు (Warns).. ఇకపై ప్రతి సిగరెట్ పైన కనిపించనున్నాయి. ‘లుకేమియాకు (Leukemia) కారణం సిగరెట్’, ‘పొగాకు పొగ చిన్నారులకు (Child) ప్రాణాంతకం’, ‘ప్రతి పఫ్ (Puff)లోనూ విషమే’ అనే హెచ్చరికలు ప్రతి సిగరెట్ పై ముద్రించనున్నారు. డబ్బాపై హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని.. తాగేటప్పుడు హెచ్చరికలు కనిపిస్తే మార్పు వస్తుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా వివరాలు తెలుసుకోండి.
మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం (World No-Tobacco Day) సందర్భంగా పొగాకు ఉత్పత్తులను ప్రజల నుంచి మాన్పించేందుకు కెనడా ప్రభుత్వం (Govt of Canada) నడుం బిగించింది. ఈ క్రమంలోనే బుధవారం పై నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నేరుగా సిగరెట్ పై హెచ్చరికలు (Warning) రాయాలని నిర్ణయించింది. ఈ విధంగా నిర్ణయం తీసుకున్న తొలి దేశం కెనడా. సిగరెట్ ఫ్రెంచ్ (French), ఆంగ్లం (English) భాషల్లో వాటిని రాయనున్నారు.
‘పొగాకు ఉత్పత్తులను మాన్పించేందుకు కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధూమపానం (Smoking) నుంచి దూరం చేయడమే లక్ష్యం. యువత (Youth) ఆరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బానిసలుగా మారిన బాగు చేసేందుకు ఇకపై సిగరెట్ లపై కూడా లేబుల్స్ అతికించనున్నాం’ అని కెనడా వైద్య శాఖ అధికారి రాబ్ కనింగ్హామ్ తెలిపారు. కొత్తగా తీసుకున్న సిగరెట్లపై హెచ్చరికల ముద్రణను ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. 2035 వరకు సిగరెట్ వినియోగాన్ని 5 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా (Target) పెట్టుకున్నట్లు వెల్లడించారు.