సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలోని శివాలయంలో సోమవారం గోటి తలంబ్రాలు, కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమాన్ని భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ప్రారంభించారు. భద్రాచలం నుంచి తెచ్చిన గోటి తలంబ్రాలు కలిశాలలో నింపి రామనామస్మరణతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని చేపట్టారు.