NGKL: కొడంగల్ నియోజవర్గంలోని దౌల్తాబాద్ పరిధిలో వేట వలలో భారీ కొండ చిలువ చిక్కింది. మండల కేంద్రంలోని దౌల్తాబాద్, రాళ్లపల్లి మధ్యలో ఉన్న అడవి సమీపంలో కొందరు వేటకు వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. ఆదివారం వెళ్లిన వేటగాళ్లు వలలో చిక్కిన కొండ చిలువను చూసి వెంటనే పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కొండ చిలువను పట్టుకున్నారు.