NGKL: నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవిని విద్యుత్ ఎంప్లాయిస్ 327 నాయకులు ఆదివారం కలిశారు. జనవరి 4న గద్వాలలో జరిగే యూనియన్ డైరీ ఆవిష్కరణకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం అందజేశారు. అంతకుముందు ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. డైరీ ఆవిష్కరణకు తప్పనిసరిగా హాజరవుతానని చెప్పారు.