JGL: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 12 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి కంటి అద్దాలు, మందులు ఉచితంగా పంపిణీ చేశారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.