HYD: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు.