KRNL: పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ అభ్యర్థులకు సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా, డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు PMT/PET పరీక్షలు జరగనున్నాయి.