ATP: మాజీ సైనికుల పిల్లలకు ప్రధానమంత్రి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించినట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి పి. తిమ్మప్ప తెలిపారు. దరఖాస్తు గడువును ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికుల పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.