ADB: కడెం ఆయకట్టు పరిధిలోని ప్రధాన, చిన్న కాలువలలో నీరు లీకేజీ కాకుండా ఇరిగేషన్ అధికారులు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని జన్నారం మండలానికి చెందిన రైతు, సామాజికవేత్త మామిడి విజయ్ కోరారు. యాసంగి సీజన్‌కు సంబంధించి అధికారులు జనవరి ఐదు నుండి సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. నీటి విడుదలకు ముందే కాలువలను తనిఖీ చేయాలన్నారు.