మాజీ ప్రధాని మన్మోహన్ స్మారకంపై కాంగ్రెస్ తీరును BJP తప్పుపట్టింది. ఈ అంశంపై మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ నేత సుధాంశు త్రివేది.. ‘మన్మోహన్‌కు మెమోరియల్‌ను నిర్మిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మన్మోహన్‌ను గౌరవించలేదు. ఆయన మరణం తర్వాత కూడా రాజకీయాలు చేస్తోంది. సర్దార్ పటేల్ నుంచి PV, ప్రణబ్ వరకు పలువురు కాంగ్రెస్ నేతలకు అన్యాయమే జరిగింది’ అని అన్నారు.