అన్నమయ్య: మదనపల్లెలో శుక్రవారం వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ నుండి కరెంటు ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై విద్యుత్ చార్జీలు పెంచిందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలన్నారు.