బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కాన్స్టాస్తో కోహ్లీ వివాదంపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఓవర్ పూర్తయ్యాక పిచ్‌పై అవతలి ఎండ్ వైపు నడిచి వెళ్తున్న కాన్స్టాస్ను కోహ్లీ ఢీ కొట్టాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది. జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా కోహ్లీ ఖాతాలో చేరింది.