NLG: 16రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొల్లూరి కృష్ణ, బొమ్మగాని రాజు అన్నారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టర్ ముందు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం16రోజుకి చేరిన సందర్భంగా మాట్లాడారు. తుఫాను ప్రభావం కురుస్తున్న వర్షంలోనూ వారు నిరసన తెలిపారు.