హన్మకొండ: జిల్లాలోని ఏకశిల కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని శ్రీదేవి మృతిపై విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఫీజు కోసం కాలేజ్ యాజమాన్యం వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. కాలేజీ ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నిన్న రాత్రి హాస్టల్లో శ్రీదేవి ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే.