MDK: పెద్ద శంకరంపేటలోని బీజేపీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శత జయంతిని బుధవారం నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో వాజ్పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ.. దేశం వాజ్పేయీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.