స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన భర్త వెంకట దత్త సాయితో తన ప్రేమ గురించి పలు ముచ్చట్లు మీడియాతో పంచుకుంది. వెంకట సాయి దత్తను చూడాగానే ప్రేమలో పడిపోయానని వెల్లడించింది. రెండేళ్ల క్రితం తనతో చేసిన విమాన ప్రయాణంతోనే తమ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని చెప్పింది. ఆ క్షణం లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా అనిపించిందని పేర్కొంది.