KMR: ఎల్లారెడ్డి మత్స్యకారులు ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లింగంపేట మండలం బాయంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాణా తయారీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి ఉన్నారు.