MNCL: తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్లో గత వారం రోజులుగా పంపులు సరిగా పనిచేయక పోవడంతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏఐటీయీసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సింగరేణి అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన అధికారికి రెండు రోజుల్లో మంచినీటి పంపులను సరిచేసి నీటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.