భారత స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తండ్రయ్యాడు. అతడి సతీమణి మేహా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షర్ పంచుకున్నాడు. అయితే ఐదు రోజుల క్రితమే తనకు కొడుకు పుట్టాడని తెలిపాడు. తనకి ‘హక్ష పటేల్’ అని పేరు పెట్టిన్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కుమారుడికి టీమిండియా జెర్సీ వేసిన ఫోటోను షేర్ చేశాడు.