TG: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి శ్రీపాదరావు చేసిన సేవలు మరువలేనివని, ఆయన బాటలో పయనించడమే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని నేతలు పేర్కొన్నారు.