Prashant Neel : ప్రశాంత్ నీల్ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. 2014లో ఉగ్రం అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ప్రశాంత్ నీల్ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. 2014లో ఉగ్రం అనే సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత 2018లో కెజియఫ్ చాప్టర్ వన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 2022లో కెజియఫ్ చాప్టర్ 2తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ రూట్ మారింది. ఫస్ట్ మూడు సినిమాలు కన్నడ హీరోలతో చేసినా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు వరుస పెట్టి తెలుగు హీరోలను లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత యష్‌తో కెజయఫ్ 3 ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెజియఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు.. రాబోయే కాలంలో ఏకంగా మూడు వేల కోట్లు సినిమాల కోసం ఖర్చు చేయబోతున్నారు. ఇప్పటికే సాలిడ్ లైనప్ సెట్ చేసే పనిలో ఉంది. వారిలో అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో హోంబలే వారు ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. ఎన్టీఆర్ సినిమా తర్వాతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే. కానీ వర్కౌట్ అవుతుందో లేదో.. ఇప్పుడే చెప్పలేం.