MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ ఛైర్మన్ మోతుకూరి రాజేశ్వరి వెంకటస్వామి, 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ కోరారు. సోమవారం 13వ వార్డులో వారు గడపగడపకు తిరుగుతూ.. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.