Mass Maharaj రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ టైం ఫిక్స్!
Raviteja : గతేడాదికి ఫైనల్ టచ్, ఈ ఏడాదికి సాలిడ్ హిట్.. రెండు రవితేజనే ఇచ్చాడు. ధమాకా చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత.. మెగాస్టార్‌తో కలిసి వాల్తేరు వీరయ్యతో.. 200 కోట్ల హీరోగా సత్తా చాటాడు మాస్ మహారాజా. ఇదే ఊపులో ఇప్పుడు రావణాసురుడిగా రాబోతున్నాడు.
గతేడాదికి ఫైనల్ టచ్, ఈ ఏడాదికి సాలిడ్ హిట్.. రెండు రవితేజనే ఇచ్చాడు. ధమాకా చిత్రంతో 100 కోట్లు కొల్లగొట్టిన తర్వాత.. మెగాస్టార్‌తో కలిసి వాల్తేరు వీరయ్యతో.. 200 కోట్ల హీరోగా సత్తా చాటాడు మాస్ మహారాజా. ఇదే ఊపులో ఇప్పుడు రావణాసురుడిగా రాబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ రాజా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’.. ఏప్రిల్ 7న థియేటర్స్‌లోకి రాబోతోంది. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో.. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అను ఇమ్మానుయేల్, దక్ష నాగర్కర్, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత.. ఈ సినిమాలో రవితేజ.. రాముడా, లేక రావణాసురుడా అనే డౌట్స్ వచ్చాయి. కానీ ఖచ్చితంగా మాస్ రాజా ఈ సినిమాలో నెగెటివ్ టచ్ ఇవ్వబోతున్నాడు. దానిపై మరింత క్లారిటీ రావాలంటే.. ట్రైలర్ రావాల్సిందే. తాజాగా రావణాసుర ట్రైలర్ డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. మార్చ్ 28 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఇంటెన్స్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. కోర్టులో ఫైర్ బ్లాస్టింగ్ అనేలా ఈ పోస్టర్ ఉంది. దాంతో రావణాసుర ట్రైలర్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. జస్ట్ టీజర్లోనే ‘సీతను తీసుకుని వెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి’.. అని భయపెట్టేశాడు రవితేజ. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.