TG: పశ్చిమాసియాలో దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. CM రేవంత్ ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖతో అధికారులు సమన్వయం చేసుకుంటూ.. విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరుల కోసం హెల్ప్ డెస్క్ సిద్ధం చేశారు. సహాయం కోసం 98719 99044, 99583 22143, 99100 14749, 96437 23157 నంబర్లను సంప్రదించండి.