KMR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి (M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.