Heavy Rains : 3 రోజులు వర్షాలు వెదర్ డిపార్ట్ మెంట్ హెచ్చరిక
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది. శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇంటీరియర్ తమిళనాడు (Tamil Nadu) నుంచి రాయలసీమ వరకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా విదర్భ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. ఒక ఉపరితల ఆవర్తనం రాయలసీమతోపాటు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్ష సూచనతో రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు (Government officials) కోరుతున్నారు.తూర్పు జిల్లా, హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశాలున్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ వేగంతో వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత (Sun intensity) ఎక్కువగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొన్నటి వరకూ ఉన్నంత తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడవు అని.. వర్షాలు అయితే ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం రాష్టంలోని కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.