NLG: హోళీ పండుగను సహజసిద్ధమైన రంగులతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం చేయరాదని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్లను మోహరించినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.