Rs.10 thousand:ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ (kcr) పరిహారం ప్రకటించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేస్తామని తెలిపారు. ఖమ్మం (kammam) జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఆయన ఈ రోజు పరిశీలించారు. పంటనష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపేదిలేదని తేల్చిచెప్పారు. ఇంతకుముందు పంపిన వాటికి మోడీ (modi) సర్కారు పరిహారం ఇవ్వలేదని చెప్పారు.
ఖమ్మం (kammam) జిల్లా మధిర నియోజకవర్గంలో గల బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నష్టపోయిన రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. పంట నష్టం వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన ప్రతీ ఎకరాకు రూ.50 వేల (rs.50 thousand) చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు సీఎం కేసీఆర్కు (cm kcr) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొత్తం 2,28,255 ఎకరాల్లో పంట దెబ్బతిందని సీఎం కేసీఆర్ (kcr) చెప్పారు. ఇందులో 1,29,446 ఎకరాల్లో మక్క, 72,709 ఎకరాల్లో వరి, 8,865 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందని తెలిపారు. ఈ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ (kcr) చెప్పారు.
వరంగల్ (warangal), కరీంనగర్ (karimnagar) జిల్లాల్లో కూడా కేసీఆర్ (kcr) పర్యటిస్తారు. కరీంనగర్ (karimnagar) జిల్లా రామడుగు మండలం ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ జిల్లాలో వరి, మామిడి, మిరప, మక్క, టమాటో పంటలకు నష్టం వాటిల్లింది. మక్క పంట కోత సమయంలో కిందపడిపోయింది. యంత్రాలతో కోయలేని పరిస్థితి ఏర్పడింది. రామడుగు మండలంలో పంటను కేసీఆర్ పరిశీలించి.. రైతులతో మాట్లాడే అవకాశం ఉంది.