Allari Naresh : అల్లరి నరేశ్ 61వ సినిమా ఓపెనింగ్ గ్యాలరీ.
అల్లరి నరేశ్(Allari Naresh) 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో(Ramanaidu Studio) పూజా కార్యక్రమం జరుపుకుంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తుంది. నేడు జరిగిన పూజా కార్యక్రమానికి తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
అల్లరి నరేశ్(Allari Naresh) 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో(Ramanaidu Studio) పూజా కార్యక్రమం జరుపుకుంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తుంది. నేడు జరిగిన పూజా కార్యక్రమానికి తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సినిమాకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ (Concept poster) ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లరి నరేశ్ మళ్ళీ పాత పంథాలోకి వచ్చేస్తాడనిపిస్తుంది.ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో మెప్పించిన అల్లరి నరేశ్(Allari Naresh) నాంది(Naandi) నుంచి తన పంథాని మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు.
అల్లరి నరేశ్ నాంది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన మరో కంటెంట్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కూడా ప్రేక్షకులని మెప్పించింది. త్వరలో నాంది డైరెక్టర్ తో ఉగ్రం(Ugram) అనే మరో సీరియస్ కంటెంట్ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్ పక్కన పెట్టి వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు అనుకున్నారు
అంతామళ్ళీ కామెడీ సినిమాలు(Comedy movies) చేస్తాడా అనే ఆలోచనలో ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో మంచి కామెడీ సినిమా వస్తే అవి కూడా చేస్తాను అని అన్నాడు అల్లరి నరేశ్. తాజాగా అల్లరి నరేశ్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. అల్లరి నరేశ్ 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమం జరుపుకుంది.
ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఫరియా కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో రావణాసుర సినిమాతో రవితేజ సరసన రాబోతుంది. ఇక అల్లరి నరేశ్ 61వ సినిమాని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తుండగా, మల్లి అంకం తెరకెక్కిస్తున్నాడు.
నేడు జరిగిన పూజా కార్యక్రమానికి తరుణ్ భాస్కర్, (Tarun Bhaskar) నాగ్ అశ్విన్, సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది లవ్, సోషల్ మీడియా, కామెడీ అంశాలతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ పోస్టర్ షేర్ చేసి మన అందరం ఇష్టపడే అల్లరోడు వస్తున్నాడు అని పోస్ట్ చేయడంతో అల్లరి నరేశ్ మళ్ళీ పాత పంథాలోకి వచ్చేస్తాడా అని అనుకుంటున్నారు. త్వరలో అల్లరి నరేశ్ ఉగ్రం సినిమాతో (Ugram is a movie) హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.