»Aussies Won The Toss And Elected To Bat 3rd Odi Cheannai Match
3rd Odi: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
భారత్తో బుధవారం చైన్నైలో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు దిగిన ఆసీస్ ఆటగాళ్లు 5 ఓవర్లకు 39 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ బుధవారం చైన్నైలో మొదలైంది. నిర్ణయాత్మక ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు గెలుపొందింది. అంతకు ముందు ముంబయిలో జరిగిన వన్డేలో ఇండియా గెలచింది. ఈ క్రమంలో ఇరు జట్లు చేరో మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ విజయంపై సిరీస్ ఎవరికి దక్కుతుందో తెలనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.