»Rs 1000 Reduced Gold During The Ugadhi Festival March 22nd 2023
Gold Rates: పండుగ వేళ రూ.1000 తగ్గిన పసిడి!
దేశంలో ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా పసిడి రేటు(gold rates) దాదాపు వెయ్యి రూపాయలకు పైగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్(hyderabad)లో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది.
ఉగాది పండుగ(ugadhi festival) సందర్భంగా బంగారం(gold) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు పసిడి ధర వెయ్యి రూపాయలకుపైగా తగ్గింది. మరోవైపు వెండి ధరలు కూడా స్పల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా, 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000గా ఉంది.
అయితే బంగారం ధరలు ద్రవ్యోల్బణం(inflation), గ్లోబల్ పాలసీలు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, సీజనల్ డిమాండ్ సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. మరోవైపు ఈ ధరలు TDS, GST విధించబడే ఇతర పన్నులను చేర్చకుండా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు(gold rates) ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు.
హైదరాబాద్(hyderabad), విజయవాడ(vijayawada), విశాఖపట్నం, భువనేశ్వర్, ముంబయి, కేరళ, నాగ్ పూర్ ప్రాంతాల్లో 10 గ్రాముల పసిడి రేటు 24 క్యారెట్లకు రూ. 59,130 ఉండగా 22 క్యారెట్లకు రూ.54,200గా ఉంది. మరోవైపు ఢిల్లీ, జైపూర్, లక్నోలో 22 క్యారెట్ల బంగారానికి రూ.54,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం(gold) ధర రూ.59,280కు చేరింది.