బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కోస్తా తీరంవైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీ, తమిళనాడులో శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.