AP: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై మాజీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అవార్డు రావడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కాగా, లక్ష్మీనారాయణ రచించిన దీపిక అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటికి సాహితీ విమర్శ విభాగంలో ఆయనకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.