TG: డా.బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ MLAలు, MLCలు, మంత్రులు పొన్నం, జూపల్లి ఆందోళనలో పాల్గొన్నారు. అమిత్ షా.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.