పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘ది రాజాసాబ్’. ఈ మూవీలో నిధి అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నిధి అగర్వాల్‌కు సంబంధించిన ఫొటో వైరల్ కాగా.. అది ‘రాజాసాబ్’ లీక్డ్ పిక్ అంటూ పలువురు దాన్ని వైరల్ చేస్తున్నారు. తాజాగా దీనిపై నిధి స్పందించింది. అది మూవీకి సంబంధించిన ఫొటో కాదని క్లారిటీ ఇచ్చింది. యాడ్ షూట్ ఫొటో అని తెలిపింది.