ASR: జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ని గురువారం రంపచోడవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. అనంతరం రంపచోడవరం పరిధిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి ఆమె తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.