ఓఝఛ అనంతపురం జిల్లా నేతలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీకి మాజీమంత్రులు శంకరనారాయణ, ఉషశ్రీ చరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. అలాగే, భవిష్యత్లో చేయబోయే ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు, పలు అంశాలపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.