అన్నమయ్య: వినియోగదారుల హక్కుల గురించి డిసెంబర్ 22వ తేదీన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాల ప్రాంగణంలో వ్యాసరచన, వకృత్వ పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గెలుపొందిన వారికి నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.