TG: బీఆర్ఎస్ కథ ముగిసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్ల దుస్తులు, ఆటో డ్రైవర్ల యూనిఫాంల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని అన్నారు. జైలు డ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ నేతలకు మిగులుతుందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలు, GHMC ఎన్నికల్లోనూ BRSను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. TRSను BRSగా మార్చటంతోనే కేసీఆర్ పని అయిపోయిందని తెలిపారు.