రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాలను సిద్ధం చేస్తోంది. తాజాగా అధునాతన లేజర్ ఆయుధం ‘ట్రైజబ్’ను తయారుచేసింది. 2 కిలోమీటర్ల దూరం నుంచి దాడులను అడ్డుకునేలా దీన్ని రూపొందించారు. దాన్ని పరీక్షించి చూశామని, అద్భుతంగా పనిచేస్తోందని ఉక్రెయిన్ కమాండర్ వాదిమ్ సుఖరెవ్స్కి తెలిపారు. కాగా, ‘ట్రైజబ్’ అంటే త్రిశూలం.. అది ఉక్రెయిన్ జాతీయ చిహ్నం.