ATP: అనంతపురం జేఎన్టీయూలోని ఈఈఈ విభాగంలో సోమవారం ‘ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రాం ఆన్ Entrepreneurship & వెంచర్ క్రియేషన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్ధి ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.