కోనసీమ: రబీ సీజన్లో 11,857 మంది రైతులు 15,794 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు ఈ క్రాప్ నమోదు అయిందని మండల వ్యవసాయశాఖ అధికారి బలుసు రవి అన్నారు. కె. గంగవరంలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం ఈ క్రాఫ్ పబ్లికేషన్ చేశారు. తప్పులు ఉంటే మూడు రోజుల్లో సరి చేయించుకోవాలని ఆయన సూచించారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.