స్టార్ హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఓ పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ గాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.