ELR: ఈనెల 12న ఏలూరు పాత బస్టాండ్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో ఏడుగురిపై కేసులు నమోదు చేశామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు అన్నారు. వారికి న్యాయమూర్తి 22,000 జరిమానా సోమవారం విధించారని ఆయన తెలిపారు. వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు తెలిస్తే ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.